Bhagavad Gita Quotes Telugu

This article provide  about Bhagavad Gita Quotes . We gave the top 20 Bhagavad Gita Quotes Telugu

Bhagavad Gita Telugu Quotes

“విషయభోగ లంపటిలో కూరుకొందువా
రాగద్వేష కామక్రోధ ఈర్ష్యాసూయలు
నీమదిని చేయు ఛిన్నాభిన్నము
క్షణిక సుఖాల సుడిగుండాన పడత్రోయును
మనో నైర్మల్యములేక వివేకహీనుడవౌదువు
ఆత్మచింత చేయలేని అశక్తుడవౌదువు
భగవచ్చింత లేని నీకు అశాంతే మిగులును
శాంతిలేక నీకు సుఖము ఎట్లు కలుగును?”

Bhagavad Gita Quotes Telugu

“విషయలంపటమైయున్న
ఇంద్రియ మొక్కటైనను
మనోయింద్రియమ్ముల సఖ్యతన్
వివేకబుద్ధిని హరింపజేసి
పాతకంబందు పడత్రోయున్
ఏలయనంగ సంసారసాగరాన గమించు
బుద్ధినావను మనోఇంద్రియ పవనంబు విషయజలకెరటాల ముంచివేసి
పాపచయ అగాధమందు పడవేయున్
ఇంద్రియసుఖాల వెంట పరుగెత్తుమనసును
అదుపునందుంచుట యుక్తమ్ము కదర”

Bhagavad Gita Quotes in Telugu

.”భగవద్గీత,ఆత్మ సంయమ యోగము

శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లో||1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః |
స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని ర్నచాక్రియ:||(కర్మయోగము)
భావము: కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.”

Bhagavad Gita Quotes in Telugu

“శ్లో౹౹
యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత౹
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం౹౹(భ.గీ.4-7)
భావగీతిక:-
ధర్మమునకు సంకటము వాటిల్లినా
అధర్మమునకు పెంపు గలిగిన నాడు
ధర్మపరులు దుఃఖ భాజనులైయుండ
దుండగీళ్ళ దురాగతాలు మితిమీరగా
దుష్టులను పరిమార్చి ధర్ములనుగావ
భగవానుడు తన్నుతాను సృజించుకొనడే”

Bhagavad Gita Quotes Telugu

“శ్లో౹౹యస్త్వాత్మరతిరేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః౹
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే౹౹
(భ.గీ.3-17)
కవితాన్వయం:
పరమాత్మ ప్రాప్తినందిన యోగికి
సామాన్యునివోలె విషయరతి
విషయసంతృప్తి విషయసంతుష్టి
కల్గియుండడుగాన కర్తవ్యకర్మ లేదు
మమతానురక్తి విషయవాంఛలు లేక
నిత్యతృప్తుడై యుండు ఆత్మలోన
ఆత్మయందురతి ఆత్మయందుతృప్తి
ఆత్మయందు సంతుష్టుడై వెలయుచుండు”

Bhagavad Gita Telugu Quotes

“కృష్ణమ్ వందే జగద్గురుమ్
~~~~~~~~~~~~~~~~~~~~~

కృష్ణయ్యా! ఓ శ్రీకృష్ణయ్యా! సృష్టిలోన ఊరు అను పేరు కలిగి దేహమన్నది ఒకటుందని
దేహములోనే ఎంత దేవులాడినను చిక్కడు దొరకడు వాడని
చిత్రగుప్త పేరును కలిగి
చిత్రవిచిత్రములెన్నో చేసేటివాడు తానై ఏ చిత్తుకూ దొరకడని
సత్తు అని పేరును కలిగి
దేహమనే గుడిలో వెలుగుతున్న చైతన్య జ్యోతిగా ఉన్నాడని
తెలిసితిమి దైవగీతనే చదివి

||ఆత్మ ప్రబోధార్పణమ్||

|| జై శ్రీకృష్ణ ||”

Bhagavad Gita Quotes in Telugu

.“దుష్ట శిక్షణ….శ్రేష్ఠ రక్షణ
~~~~~~~~~~~~~~~~~~~~~~
వినాశాయ చదుష్కృతామ్! యని శ్రీ భగవంతుడే తెల్పినను
ధర్మపరులగు దుష్ట మానవులు గ్రహించలేదు గూఢార్థమును
సంభవామి యుగే యుగే! యనినా గుర్తించలేదు తన జన్మను
దానమడిగేవాడు ధర్మమనినను ధనమిచ్చిరి గ్రుడ్డితనంతోను

|| ఆత్మ ప్రబోధార్పణమ్ ||”

Bhagavad Gita Quotes Telugu

“శ్లో౹౹
ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః౹
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ౹౹
(భ.గీ.3-42)
గీతాభావం:-
దేహేంద్రియ మనోబుద్ధులు
ఒకదానిపై మరొక్కటి ఉన్నతాలు
అవి కామ వికార కేంద్రాలు
ఆత్మ స్థానం ఉన్నతం చైతన్యవంతం
జీవుడది యెఱింగి యచ్చటికేగిన
కామపీడనలను కాల్చగలడు
మనోవికారములను కూల్చగలడు
ముక్తి స్థానము పొందగలడు”

Bhagavad Gita Telugu Quotes

“శ్లోకం౹౹
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్
స్వనిష్ఠితాత్౹
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః౹౹
(భ.గీ 3-35)
కవితాన్వయం:
స్వధర్మపాలనలో మరణమెదురైననూ పరధర్మమెంత సుగుణమైనదైనా
స్వధర్మాచరణే మేలుకల్గునెంతయున్
పరధర్మాచరణ దుఃఖహేతువుకాదే
తనవిద్యుక్త ధర్మము స్వధర్మమౌను
ఖ్యాతి కల్గు జగాన వాని ధర్మనిరతికిన్
పరధర్మము యొనరించిన తుదకు
హీనగతిని బొంది గార్ధభంబు చావదే?”

Bhagavad Gita Quotes in Telugu

“గీత…దాటవద్దు…..హద్దు…..మీరవద్దు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

గీయబడిన గీతను గూర్చిన వివరములు విశదపరచబడెను
దేహమనెడి హద్దును గూర్చిన వివరము తెలియజెప్పబడెను
గుణమాయను దాటుట దుస్సాధ్యం అని కూడా చెప్పబడెను
హద్దుమీరినచో శిక్షింపబడుటన్ చూసేయున్నారు అందరును

|| ఆత్మ ప్రబోధార్పణమ్ ||”

Bhagavad Gita Quotes Telugu

“భగవద్గీత,సాంఖ్య యోగము

శ్లో|| 22: వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో ఽ పరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి||
(జీవాత్మ)

భావము : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.”

Bhagavad Gita Telugu Quotes

“కృష్ణ పాదాలు
బ్రహ్మ కడిగిన పాదాలు
భగవత్గీత పాదాలు
బ్రహ్మజ్ఞానమొసంగు పాదాలు”

Bhagavad Gita Quotes Telugu

“భగవద్గీత…
మనిషి చచ్చిపోయినపుడు వినేది కాదు.
మనిషి ఓటమి పాలైనపుడు…
మనిషి నైరాష్యంలో కూరుకుపోయినపుడు
మనసు చచ్చిపోయినపుడు…”

Bhagavad Gita Quotes in Telugu

“దుష్ట శిక్షణ….శ్రేష్ఠ రక్షణ
~~~~~~~~~~~~~~~~~~~~~~
వినాశాయ చదుష్కృతామ్! యని శ్రీ భగవంతుడే తెల్పినను
ధర్మపరులగు దుష్ట మానవులు గ్రహించలేదు గూఢార్థమును
సంభవామి యుగే యుగే! యనినా గుర్తించలేదు తన జన్మను
దానమడిగేవాడు ధర్మమనినను ధనమిచ్చిరి గ్రుడ్డితనంతోను

|| ఆత్మ ప్రబోధార్పణమ్ ||”

Bhagavad Gita Quotes Telugu

“శ్లో౹౹
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క్రుతాం౹
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే౹౹(భ.గీ.4-8)

గీతాగీతిక:-
సదాచార సంపన్నులు
భగవద్భక్తులు
ధర్మాచరణ పరాయణులు
దుర్మార్గానికి బలౌవుతున్నప్పుడు
శిష్టులను రక్షింప
దుష్టులను శిక్షింప
ధర్మాన్ని కాపాడగా
భగవానుడు స్వయముగా తానే
ఈ భువిపై అవతరించుతాడు
తస్మాత్ దుర్మార్గానికి దూరంగా
ధర్మాన్ని అనుసరింప వలెన్”

Bhagavad Gita Telugu Quotes

“భగవద్గీత,పురుషోత్తమ ప్రాప్తి యోగము

శ్లో || 15: సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ|
వే దైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || (ఆత్మ)

భావము : సర్వజీవరాసుల హృదయ స్థానములో నేనున్నాను. స్మృతి, ఙ్ఞానము, ఊహ దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేదవేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదముల తెలిసినవాడను నేనే.

గమనిక: హృది=హృదయము=బ్రహ్మనాడి”

Bhagavad Gita Quotes Telugu

“ఆత్మ సనాతనము నిత్యంబు
సర్వగతమై వెలుగొందుచుండు
స్థాణువై కదలక నిలిచియుండు
శస్త్రాస్త్రములు దీనిని ఛేదింపలేవు
అగ్నిచే దీనిని దహింప శక్యంబుకాదు
జలభూతమున నిది తడియంగబడదు
వాయువాత్మను శోషింప సాధ్యంబుగాదు”

Bhagavad Gita Quotes in Telugu

.“భగవద్గీత,ఆత్మ సంయమ యోగము

శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లో||1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః |
స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని ర్నచాక్రియ:||(కర్మయోగము)
భావము: కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.”

Bhagavad Gita Quotes Telugu

“భగవద్గీత విన్న వాళ్లందరు
యుద్ధంలో గెలుపొందలేరు

భగవద్గీత చెప్తున్న వాళ్లందరూ
నిన్ను యుద్ధంలో గెలిపించనూలేరు

సమర శంఖం పూరించాల్సిందీ నువ్వే
రంగస్థలపు రణరంగంలో గెలవాల్సిందీ నువ్వే.”

Bhagavad Gita Telugu Quotes

“శ్లో౹౹
వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః౹
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః౹౹”

Bhagavad Gita Quotes in Telugu

“భగవద్గీతే కదా
భవితకు ఆధారం
నారి శక్తిని తెలిపేది
సమస్యకు పరిష్కారం
వారెవ్వా ముక్తికి
మార్గం గీతాసారం”

Bhagavad Gita Quotes Telugu

“దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.”

తా: దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించుట,బాహ్యాంతరశుద్ధి కలిగియుండుట,ఋజుత్వము తో కూడి ఉండుట, బ్రహ్మచర్య వ్రతం పాలించుట,ఏ ప్రాణిని హింసించ కుండుట, శారీరక తపస్సని చెప్పబడు చున్నది.”

1 thought on “Bhagavad Gita Quotes Telugu”

Leave a Comment