Nammakam Quotes in Telugu

This article provide  about Nammakam Quotes. We gave the top 50 Nammakam Quotes in Telugu 

Telugu Nammakam Quotes :

“నమ్మకపోతే అనుమానిస్థుడు అంటారు..
నమ్మితే అమాయకుడిని చేస్తారు..”

Nammakam Quotes :

“ఇష్టం పోతే మళ్ళీ వస్తుంది ,
ఏదయినా వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు ,
ప్రేమ చచ్చిపోయిన మళ్ళీ పట్టొచ్చు
కానీ ఒకసారి నమ్మకం పోతే మాత్రం అది ఎప్పటికి తిరిగి రాదు.”

Nammakam Quotes :

“జీవితం లో ఏదీ శాశ్వతం కాదు…
చెప్పేవి అన్నీ నిజాలు కావు… ఎవర్నీ నమ్మలేం…
నమ్మకుండా బ్రతకలేం…
అదే జీవితం…
అంతే జీవితం….!!”

Nammakam Quotes :

“నువ్వు ఏడ్చినా పర్లేదు,
నిన్ను నమ్మిన వాళ్ళని ఏడ్పించకు.”

Nammakam Quotes :

“నాకు దేవుడు అంటే
భక్తి లేదు భయం లేదు
ప్రేమ లేదు కోపం లేదు
గౌరవం లేదు విసుగు లేదు
ఆరాధన లేదు అవిధేయత లేదు
ఎందుకంటే అతను/ఆమె ఉన్నాడని నాకు నమ్మకం లేదు
ఉంటే బాగుండు అనిపిస్తుంది”

Nammakam Quotes in Telugu

“నమ్మితే మోసపోతాం,
నమ్మకపోతే ఒంటరౌతాం…
నమ్మి మోసపోవడం కంటే
నమ్మకపోవడమే మంచిదేమో”

Nammakam Quotes :

“ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలిస్తే
జీవితం ఇంత క్లిష్టంగా ఉండదేమో…..??!!!”

Nammakam Quotes :

“అందరినీ నమ్మడమే నాకు తెలుసు
నమ్మి మోస పోవడమే నాకు తెలుసు
లోకంలో మంచోళ్లు ఉన్నారని తెలుసు
ఆ నమ్మకమే వారికి కలిసొచ్చే అలుసు
అయినా నమ్మడమే నాకు తెలుసు”

Nammakam Quotes :

“నమ్మకం
మాటల్లో వినబడేది
చేతల్లో కనబడేది”

Nammakam Quotes :

“ఆశల హరివిల్లు కు నమ్మకం చేయూత
తహతహ లాడుతున్న ఆ మనస్సుకి నమ్మకం ఒక పిలుపు
పరిచయాల దారిలో నమ్మకం ఒక తోడు”

Nammakam Quotes in Telugu

“ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంకా
ఈ ప్రాణం ఉంది అంటే
మా అమ్మ ఉందనే ధైర్యం!
నేను ఏ పని చేసిన తప్పు
మాత్రము చేయను అని
మా అమ్మకు నాపై ఉన్న నమ్మకం !”

Nammakam Quotes :

“స్నేహితులతో అన్ని విషయాలు పంచుకుంటాను
స్నేహమనే నమ్మకం !
కవిత్వం రాస్తే బాధలు తీరుతాయి
కవిత్వమనే నమ్మకం!
ప్రేమతో దగ్గరవుతాయి దూరమైన బంధాలు
ప్రేమనే నమ్మకం!
భగవంతుడి ఆశీర్వాదం కోరుకుంటాను
భగవంతుడనే నమ్మకం!
తలచుకుంటే చేయలేనిది ఏది లేదు
ఇది నా నమ్మకం!”

Nammakam Quotes :

“నమ్మిన మనిషి కంటే,
నమ్మకంగా ఉండేవి జంతువులే.”

Nammakam Quotes :

“నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమౌతుందన్నావు,
మరి నా మౌనానికి అర్థం ఏంటో చెప్పగలవా ఓ సారి!?”

Nammakam Quotes :

“నమ్మలేనివి అబద్దాలు కాదు,
మనకి‌ నమ్మకం లేనివి అబద్దాలు.
అవి జీవితాలైనా మనుషులైనా”

Nammakam Quotes in Telugu

“నమ్మకు నమ్మకు నమ్మకు
నీ నీడనైనా నమ్మి సాహచర్యం చేయకు
అంతా స్వార్ధం స్వార్ధం‌ స్వార్ధం”

Nammakam Quotes :

“గౌరవానికి తలవంచి గౌరవం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలో,
నమ్మకానికి ఇచ్చిన మాటకోసం నమ్మకాన్ని నిలబెట్టాలో తెలియని సందిగ్ధంలో నలుగుతున్న ఒక సగటు మనిషిని నేను.”

Nammakam Quotes :

“జీవితములో
నా నమ్మకము ఎన్ని సార్లు
వమ్ము అయినా
నిన్ను నమ్మే అలవాటు
మాత్రం నా నుండీ దూరం కాలేదు కృప్ణా
ఇదే నా బలమూ
ఇదే నా బలహీనతా
సుమనప్రణవ్ “

Nammakam Quotes :

“నీపై నీకు నమ్మకం ఉన్నంతవరకు ,
ఓటమి నీ దరికి చేరదు.”

Nammakam Quotes :

“.గెలవాలి అనే తపన..
గెలుస్తాననే నమ్మకం..
ఈ రెండే నా ఆశకు ఆయువు
నా జీవానికి ప్రాణవాయువు..!!”

Nammakam Quotes in Telugu

” నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం
ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం తేలిక”

Nammakam Quotes :

“నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్మూ అని చెప్పాల్సిన అవసరం లేదు.

నీ గురించి తెలియని వాళ్లకు నన్ను నమ్మూ అని వివరించాల్సిన పని లేదు.

నమ్మకానికి నమ్మకంతోనే జతుండాలి”

Nammakam Quotes :

“నమ్మకం లేని స్నేహం,
నమ్మకం లేని ప్రేమ,
నమ్మకం లేని బంధం,
మనశాంతిని దూరం చేస్తాయి. “

Nammakam Quotes :

“నిశి చీకట్లు జీవితంలో;
చీకటిని ఛేదించాలని
తపన మదిలో
ఛేదించగలను అను
ఆశ నమ్మకం హృదిలో
మిణుగురై తమస్సుని
వెలుగుచేయ ప్రయత్నించి
సాధించి అందకారాన్ని
పారద్రోలి నవ్వుల
ఆనందపు వెలుగులను
పూయించుకొనెను తనకు
తానే తన జీవితంలో”

Nammakam Quotes :

“ఇతరుల పైన మీకు ఉన్న
విశ్వాసాన్ని,.. నమ్మకాన్ని
కాస్తంతైనా మీ మీద మీకు ఉంటే
ఎంతటి కార్యములనైనా ఇట్టే
చేయవచ్చును,…కాదంటారా..!!”

Nammakam Quotes in Telugu

“నీ చెలిమే జతగా అడుగులు వేశా
బాధించే గతకాలపు విషసర్పాలను దూరం చేశా
ప్రశ్నించే అవివేకులకు అంతుచిక్కని సమాధానం ఇచ్చా
నాదైన లోకంలో వేల రంగుల హరివిల్లులు చూశా
గమనించే లోగా కాలం పరుగులు పెట్టింది
అడుగులు వేయించిన నీవే అగాథంలోకి నెట్టావు
నాదని అనుకున్న లోకం నన్ను చూసి నవ్వింది
హరివిల్లు నన్ను చూసి హేలన చేసింది
కానీ నీ స్నేహానికి నేనిచ్చే విలువ, నా మీద
నాకున్న నమ్మకం భూదేవిలా నిలిచి ఉన్నాయి.”

Nammakam Quotes in Telugu

“మనం నమ్మిందే నిజమయ్యి …
ఆశించిందే ఎదురయ్యి ,…
నచ్చిందే సొంతమయ్యి ….
మెచ్చిందే జరిగితే జీవితం బాగుండేదేమో ..”

Nammakam Quotes

“మనసును బలహీనం చేసేది
బలహీన మనసున వెలిసేది

ద్రోహానికి దారులు వేసేది
దారులను మూసి చూపేది

నవ్విస్తూ చిగురులు తొడిగేది
ఏడ్చేందుకు కారణమయ్యేది

————-నమ్మకం “

Nammakam Quotes in Telugu

“నీ మీద నాకున్న నమ్మకానికి
నను నీటిమీద కూడ
నడిపించేంత శక్తుంది తెలుసా!”

Nammakam Quotes in Telugu

“నమ్మకం ఉన్న చోట
చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది
నమ్మకం లేని చోట
వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది “

Nammakam Quotes in Telugu

“భయంతో మొదలైన బంధాలకు
భవిష్యత్ శూన్యం
నమ్మకంతో నడిచే బంధాలకు
నూరేళ్ల ఆయుస్షు”

Nammakam Quotes

“ఏ మూలనో మనసు ఇంకా బతికే ఉంది,
కరునిస్తుందన్న ఆశో, కలిసొస్తుందన్న నమ్మకమో మరి”

Nammakam Quotes

“నమ్మకం అనే పదం చాలా విలువైనది
ఒక్కసారి మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేస్తే జీవితంలో మళ్ళీ వాళ్ళని నమ్మలేం కనీసం వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేము అందుకే దేనిని కోల్పోయిన నమ్మకాన్ని కోల్పోకూడదు….”

Nammakam Quotes in Telugu

“బ్రతకడానికి బోలెడు కారణాలు వెతుక్కోవాలేమో?
జీవించడానికి ఓ నమ్మకం చాలనిపిస్తుంది
ఆ నమ్మకం నీలోనే కనిపిస్తుంది”

Nammakam Quotes

“నమ్మకం ఉంటే
రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు
నమ్మకం లేకపోతే
మనిషిలో కూడా రాక్షసుడు కనిపిస్తాడు”

Nammakam Quotes

“నమ్మకం అనేది మలిపే రబ్బర్ లాంటిది,
మనం చేసే తప్పులకు, చెప్పే అబద్ధాలకు
దాని పరిమాణం తగ్గిపోతుంటుంది…”

Nammakam Quotes in Telugu

“నమ్మకం
జీవితాన్ని
నిలబెట్టగలదు
కూల్చేయగలదు”

Nammakam Quotes

“మనిషిని నడిపేది మంచి చెడూ కాదు
తను నమ్మిన కారణం
అదే నిజమన్న నమ్మకం “

Nammakam Quotes

“ఏం చేసినా విడిపోమనే
అతి నమ్మకమో,
వదిలేసి పోతారనే
అపనమ్మకమో..

నిండు మనసులను,
నిండా ముంచింది..!!”

Nammakam Quotes

“నమ్మకం లేనిదే ప్రేమ..
ప్రేమ లేనిదే ద్వేషం..
ద్వేషం లేనిదే పగ ..
పగ లేనిదే ప్రతీకారం ఉండవు..”

Nammakam Quotes in Telugu

“ఈ ప్రపంచంలో ఏ బంధం
అయినా నమ్మకపు పునాది
మీద నిర్మించబడుతుంది.”

Nammakam Quotes

“నమ్మకం పోతే రానిది,
వస్తే పోనిది.”

Nammakam Quotes

“మన నమ్మిన బంటే మన నమ్మకాన్ని అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది…

జాగ్రత్త మిత్రమా…..”

Nammakam Quotes

“అమృతమని నమ్మి విషం తాగినా బ్రతుకుతాం…
విషమేమోనని అనుమానంతో అమృతం తాగినా పోతాం…”

Nammakam Quotes

“ఎవరినో ఎందుకు నమ్మడం? అన్నీ తెలిసి
మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే..!!”

Nammakam Quotes in Telugu

“మన స్వేచ్చ యొక్క విలువ

–    నమ్మకం !”

Nammakam Quotes

“గుడ్డిగా నమ్మే వాళ్ళు,
నిజంగా గుడ్డివాళ్ళు.”

Nammakam Quotes

“.మనలోని నమ్మకాలు
దెయ్యాల వైపు నడిపిస్తాయి”

Nammakam Quotes

“అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూస్తుంటారు,
నిజాన్ని దాచలేమని మాత్రం తెలుసుకోలేక పోతుంటారు.”

Nammakam Quotes in Telugu

“నమ్మితే నిన్ను వదలని నమ్మకం
కదిలితే నీ తోడునడిచే జ్ఞాపకం
స్నేహం…”

Leave a Comment